ఉపాసన ధరించిన ఈ డ్రస్సు ధర అన్ని లక్షలా..!!
వీరు వేసుకొని చెప్పులు, వాచ్ ,దుస్తులు కొన్ని లక్షలు కోట్ల రూపాయల కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇటీవల టాలీవుడ్ లో మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోటు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టుగా కొన్ని రకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా అల్లుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా మెగా కోడలు ఉపాసన ,లావణ్య త్రిపాఠి, స్నేహారెడ్డి తో పాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
క్రిస్మస్ కావడంతో వీరందరూ కూడా ఎరుపు రంగు దుస్తులలోనే కనిపించారు. అయితే ఉపాసన క్రిస్మస్ సెలబ్రేషన్ లో వేసుకున్నటువంటి డ్రెస్ ఖరీదు గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ 3 లక్షల రూపాయలు ఖర్చు చేశారని విషయం వైరల్ గా మారుతోంది .ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కేవలం ఒక్కరోజు వేసుకొని ఈ క్రిస్మస్ స్పెషల్ డే దుస్తుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారా అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు.