2023 ఓవర్సీస్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు

Anilkumar
  ఈ జనరేషన్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. ఇక 2023 లో ఓవర్సీస్ లో హైయెస్ట్ అందుకున్న టాలీవుడ్ సినిమాలను పరిశీలిస్తే వీటిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు సీనియర్, మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఉండడం విశేషం. నిజానికి ఈ ఇయర్ చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వలేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలు అందరూ వచ్చే ఏడాది తమ తమ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. 

ఇక ఈ ఇయర్లో ఒక్క ప్రభాస్ నుండి మాత్రమే రెండు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. కాగా 2023లో ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ప్రభాస్ 'సలార్' మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ ఇప్పటికే ఓవర్సీస్ లో రూ.100 కోట్ల గ్రాస్ అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత 'ఆదిపురుష్' రూ.50 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రభాస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' ఓవర్సీస్ లో రూ.27.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగులో నటించిన 'సార్' మూవీ రూ.25 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. నాచురల్ స్టార్ నాని 'దసరా' మూవీతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో రూ.22.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. దసరా తర్వాత ఆరో స్థానం కూడా నానికే దక్కింది. రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన :హాయ్ నాన్న' కేవలం మౌత్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ ఏడాది నాని నుంచి రెండు సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ దగ్గర సత్తా చాటాయి. ప్రభాస్ తర్వాత నానికే ఈ అరుదైన ఘనత దక్కింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: