బ్రహ్మానందం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. టాలీవుడ్ చరిత్రలో తిరుగులేని రికార్డులను సృష్టించాడు. ఏకంగా 1500కు పైగా సినిమాల్లో నటించిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ను క్రియేట్ చేశారు.మరోవైపు కోట్లాది తెలుగు ప్రేక్షకులకు ఎనలేని ఆనందాన్ని పంచిపెట్టాడు. ప్రస్తుతం జోరుగా సినిమాలు చేయకపోయినా ఆయన హావభావాలు మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఆయనను చూడకుండా ఏ ప్రేక్షకుడు నిద్రపోలేడనే చెప్పాలి.ఇక బ్రహ్మానందానికి తెలుగు భాష, సాహిత్యం పట్ల ఎంతటి ప్రావీణ్యం ఉందో తెలిసిందే. ఆయనకు కళలపైనా అమితాసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం సినిమాలను అంతంత మాత్రానే చేస్తుండటంతో ఇటీవల రచనలు కూడా చేస్తున్నారు. కొద్దిరోజులుగా బ్రహ్మానందం తన ఆత్మకథను రాసుకొస్తున్నారు. ఆయన జీవితంలో జరిగిన ఘటనలను, అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అది పూర్తైంది. 'నేను' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.నేను బుక్‌ను తాజాగా బ్రహ్మానందం మెగాస్టార్ చిరంజీవి కి ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా చిరు, సతీమణి సురేఖతో కలిసి ఆయన్ని సన్మానించారు. మంచి పుస్తకాన్ని రీడర్స్ కోసం తీసుకొస్తుండటంతో అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫొటోలను పంచుకుంటూ బ్రహ్మానందం గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు చిరు.
పోస్ట్‌లో.. 'నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం.తానే చెప్పినట్టు 'ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన 'అన్వీక్షికి' వారిని అభినందిస్తున్నాను!' అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి చివరిగా 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం Mega156లో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు