హీరో విజయ్ కాంత్ మృతిపై.. ఏడుస్తూ వీడియోని రిలీజ్ చేసిన విశాల్..!!
చాలామంది సెలబ్రిటీల సైతం విజయకాంత్ తో ఉన్న అనుబంధాన్ని సైతం పంచుకుంటూ ఆయనకు సంతాపం తెలియజేశారు. ఈ విషయం పైన తాజాగా హీరో విశాల్ కెప్టెన్ మరణం పైన తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఏడుస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.. తన జీవితంలో తాను కలిసిన అత్యంత ఉత్తమమైన వ్యక్తులలో..#Captain Vijaykanth అన్న మరణ వార్త విన్న తర్వాత తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ తెలియజేస్తున్నారు.. కెప్టెన్ అన్న లేరని మాట అసలు ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఈ వీడియోలో తెలిపారు.
ఆయన నుంచి తాను సామాజిక సేవ కార్యక్రమాలను నేర్చుకున్నానని కెప్టెన్ అన్న ఈరోజు వరకు మిమ్మల్ని అనుసరిస్తూనే ఉన్నాను.. మన సమాజానికి అవసరమయ్యే వంటి వారిని దేవుడు ఎంత త్వరగా దూరం చేస్తారు.. మిమ్మల్ని చివరిసారి చూడడానికి సైతం అక్కడికి రాలేనని చింతిస్తున్నాను.. నాకు స్ఫూర్తిని కలిగించిన మీలాంటి యోధుడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ విశాల్ ఒక వీడియోతో తెలియజేశారు. మీరు అందరు మాదిరిలో గుర్తుండిపోతారు ఎందుకంటే ప్రజలకు మరియు నడిగర్ సంఘం కోసం మీరు చేసిన ప్రతి పని కూడా అందరు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.