Devil -2 : డెవిల్ -2గురించి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..?

Divya
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పిరియాడిక్ పై యాక్షన్ త్రిల్లర్ చిత్రం డెవిల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అభిషేక్ నాయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ కా సంయుక్త మీనన్ నటించగా మరొక హీరోయిన్ మాళవిక నాయర్ కీలకమైన పాత్రలో నటించారు. డెవిల్ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్ అతని అనుచరులు సైతం బ్రిటిష్ వాళ్ళను పట్టుకోవడానికి చేసేటువంటి పలు రకాల ప్రయత్నాలను ఈ చిత్రంలో చూపించారు.. అలాగే మరొకవైపు హత్య కేసును చేదించడం వంటి కథాంశాలతో డెవిల్ సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది.

డెవిల్ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో డెవిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. చిత్ర బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ ని చేసుకుంది ఈ సెలబ్రేషన్స్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ డెవిల్-2 సినిమా ఖచ్చితంగా ఉంటుందంటూ ఇదే టీమ్ తో చేస్తామంటూ తెలియజేశారు.. 2024లో డెవిల్-2 మొదలుపెట్టి 2025లో విడుదల చేస్తామంటూ తెలిపారు. ఈ సినిమా షూట్ మొత్తం పది రోజులకే శ్రీకాంత్ పార్ట్ -2 కథను సైతం తనకి చెప్పారంటూ తెలిపారు.

సీక్రెట్ సర్వీస్ తో ఈ కథ ముగుస్తుందని ఆ లైన్ తనకు బాగా నచ్చింది అంటూ తెలిపారు కళ్యాణ్ రామ్. డెవిల్-2 చిత్రం 1940 కాలంలో రాబోతోంది అలాగే 2000 సమయంలో కూడా ఉంటుంది అని రెండు కాలాలకు సంబంధించిన ఈ కథ ఒకేలా సాగుతుందని తెలిపారు. ఓవరాల్ గా డెవిల్ -2 చిత్రంపై కళ్యాణ్ రామ్ తెలియజేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ డెవిల్ చిత్రం రాబట్టిందనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది గంటలు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: