ఆ కారణంగా పవర్ స్టార్ కోసం మహేష్ వెయిటింగ్....??
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 7వ తేదీ, లేదా 8వ తేదీన గ్రాండ్ గా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో చేద్దాం అని అనుకుంటున్నారు. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుంది అని మహేష్ ఆలోచన అట. ఈ విషయాన్నీ త్రివిక్రమ్ కి చెప్తే, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే జనవరి 7,8 తేదీలలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో క్షణం తీరిక లేకుండా చర్చలు జరుపుతూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ డేట్ ఆ సమయానికి ఖాళీగా ఉంటుందా లేదా అని కనుక్కునే ప్రయత్నం లో ఉన్నాడట త్రివిక్రమ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వస్తే మహేష్ పవన్ మ్యూచువల్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పవన్ మరియు మహేష్ కలవడం చాలా తక్కువ సార్లు జరిగింది. ఇద్దరు కలిసి ఒక ఫొట ఫ్రేమ్ లో కనిపించి కూడా ఏళ్ళు గడిచాయి. అలాంటిది ఇద్దరినీ ఒకే స్టేజి మీద చూస్తే అభిమానుల పరిస్థితి ఆరోజు ఎలా ఉండబోతుందో చూడాలి.