ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో వైరల్ గా మారిన మూవీ...!!

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలోకి విడుదల అయింది.కామెడీ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కిన డంకీ మూవీ షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టు ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీ తెరకెక్కింది.. ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ మూవీ పోటీలో ఉండడం కూడా డంకీకి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు, డంకీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్టింట పుకార్లు వైరల్ అవుతున్నాయి.
డంకీ మూవీ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన 'జియో సినిమా' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. జియో సినిమానే ప్రకటించిందనేలా ఓ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదు. జనవరి 1వ తేదీన డంకీ మూవీ ఓటీటీలోకి రావడం లేదుడంకీ సినిమా జనవరి 1న స్ట్రీమింగ్‍కు వస్తుందనే పోస్టర్ కావాలనే కొందరు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ వార్ కారణంగా దీన్ని కొందరు బాగా వైరల్ చేస్తున్నారు.. జనవరి 1న డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రావడం లేదు.థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తో డంకీ సినిమా మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఫిబ్రవరిలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా జనవరి 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటూ మరో పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. అయితే, అది అధికారిక ప్రకటన మాత్రం కాదు. ఆ ఫేక్ పోస్టర్ మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతుంది.జనవరి 12న సలార్ ఓటీటీలోకి రావడం లేదు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఫ్యాన్స్ వార్‌లో భాగంగానే కొందరు ఇలా సలార్, డంకీ ఓటీటీ రిలీజ్‍లపై పోస్టర్లను వైరల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: