కోలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజాయలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా ధనుష్ తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
కొంత కాలం క్రితం ఈ నటుడు తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ప్రస్తుతం కూడా ఈ నటుడు టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఉద్దేశంలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.