వైట్ కలర్ పలుచటి శారీలో హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న నందితా శ్వేత..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నందితా శ్వేత ఒకరు. ఈమె నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిన్నదానికి ఆ తరువాత వరుసగా టాలీవుడ్ లో సినిమా అవకాశాలు దక్కాయి. ఇకపోతే ఎక్కువ శాతం ఈ బ్యూటీ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.
 


తాజాగా ఈ నటి అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో రూపొందిన మంగళవారం సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నందిత తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది.

నందిత సోషల్ మీడియాలో చాలా ఫోటోలను పోస్ట్ చేస్తున్నప్పటికీ అందులో ఎక్కువగా శాతం క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. వాటి ద్వారానే ఈ ముద్దుగుమ్మ వైరల్ కూడా అవుతూ ఉంటుంది. తాజాగా కూడా ఈ నటి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి వైట్ కలర్ శారీని కట్టుకొని ధరించి హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: