గుంటూరు కారం చిత్రంలో ఈ హీరోయిన్ పరిస్థితి ఏంటి..?
అయితే ఇప్పటివరకు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లలో ఎక్కువగా శ్రీ లిలను మాత్రమే హైలైట్ గా చేస్తున్నారు. కానీ ఇందులో మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ గురించి ఏ ఒక్క అప్డేట్ కూడా తెలియజేయలేదు.. కానీ కేవలం ఈమె సినిమాలో నటిస్తోందని విషయం మాత్రం తెలియజేశారు. కానీ ఆమె పాత్రకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. అయితే మీనాక్షి సోదరి ఇందులో గుర్తింపు లేకుండా కేవలం గ్లామర్ పాత్ర నే చేస్తుందా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.
గతంలో కూడా త్రివిక్రమ్ ఎన్నో చిత్రాలలో ఎవరో ఒకరిని సెకండ్ హీరోయిన్గా గ్లామరస్ బ్యూటీగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీనాక్షి కి కూడా అలాంటి పాత్రలో నటిస్తోందా లేకపోతే ఏదైనా సెంటిమెంట్ పాత్రలో కనిపించబోతుందా అని అనుమానాలు మొదలవుతున్నాయి. గతంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే అనుకోగా సెకండ్ హీరోయిన్గా శ్రీలీల అని అనుకున్నారు..ఆ తర్వాత మళ్లీ పూజను తీసేసి శ్రీ లీల అని మెయిన్ హీరోయిన్ గా మార్చేశారు చిత్ర బృందం. ఇప్పుడు మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్గా ఇందులో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈమె గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.