"గుంటూరు కారం" ఫస్ట్ డే ఫస్ట్ షో ఇండియా... ఓవర్సీస్ టైమింగ్స్ ఇవే..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఆఖరుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ మహేష్ కి జోడిగా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.


ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాని మొదలు పెట్టాడు. ఈ మూవీ మొదలు పెట్టి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ సినిమా షూటింగ్ కాస్త స్లో గా కావడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ కి సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండడంతో ప్రస్తుతం దానిని కూడా ఈ మూవీ మేకర్స్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.


అందులో భాగంగా తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఇండియా మరియు ఓవర్ సిస్ లో షో లను ఏ సమయంలో ప్రదర్శించబోతున్నారు అనే విషయానికి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఫస్ట్ డే ఫస్ట్ షో ఇండియాలో ఉదయం 4 గంటలకు జనవరి 12 వ తేదీన ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క ఫస్ట్ డే ఫస్ట్ షో ఓవర్ సీస్ లో జనవరి 12 వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: