సలార్ మూవీపై.. ప్రశాంత్ నీల్ 100% సంతృప్తిగా లేడట తెలుసా?
ఇక ప్రశాంత్ నీల్ సినిమా తెరకెక్కించిన విధానంపై ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో సంతృప్తి పొందారు. ఇలాంటి సినిమానే మేము ఇన్ని రోజుల నుంచి కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మాత్రం సలాడ్ సినిమాతో 100% సంతృప్తి మాత్రం లేదు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సలార్ పై ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పిన ప్రశాంత్.. ఆయన రియాక్షన్ కూడా ఎంతో ఉత్సాహకరంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
అయితే తనకు మాత్రం సలార్ సినిమా విషయంలో 100% సంతృప్తి లేదు అంటూ ఇక ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే కేవలం సలార్ మాత్రమే కాదు తాను తెరకెక్కించిన ఏ సినిమాపై కూడా తనకు ఎప్పుడు 100% సంతృప్తి ఉండదు అందరూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇంకా కాస్త మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేదేమో అని ప్రతి సినిమా తీసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకే కాదు ప్రతి ఫిలిం మేకర్ కి కూడా అలాగే అనిపిస్తుంది అంటూ తెలిపాడు. కే జి ఎఫ్ 2 అవుట్ ఫుట్ విషయంలో కూడా తాను సంతృప్తి చెందలేదు అంటూ ప్రశాంత్ వెల్లడించాడు.