రామ్ చరణ్ తో సినిమా పై డంకీ డైరెక్టర్ క్లారిటీ..!!

Divya
టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ త్వరలోనే డంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయం పైన డైరెక్టర్ రాజ్ కుమార్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. రామ్ చరణ్ నాకు బాగా తెలుసు ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని.. ప్రస్తుతానికైతే ఆయనతో సినిమా చేయడం లేదని తెలియజేశారు.అదే విధంగా rrr చిత్రంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందంటూ చరణ్ పైన పొగడ్తల వర్షం కురిపించారు రాజ్ కుమార్ హిరానీ.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన చిత్రం డంకీ ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ నటించిన డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకి పోటీగా సలార్ సినిమా విడుదలైనప్పటికీ కూడా కలెక్షన్స్ విషయంలో కాస్త దర్గాయని వార్తలు వినిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో మరొకసారి సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నదట. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు.

డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ డైరెక్టర్ శంకర్ భారతీయుడు -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం చేత కొద్దిరోజులు ఈ సినిమాకి గ్యాప్ ఇచ్చారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఈ సినిమాని విడుదల చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్. అలాగే ఇటీవలే స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టుని రామ్ చరణ్ కొనుగోలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: