OG సినిమా పైన అప్డేట్ ఇచ్చిన DVV నిర్మాత..!!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో OG సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కొన్ని కారణాల చేత షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం చేత ఎప్పుడు సినిమాలు చేస్తారనే విషయం ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనివల్ల నిర్మాతలు సైతం చాలా నష్టపోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అప్పుడే రాజకీయ వేడి మొదలయ్యిందని చెప్పవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉండగా సినిమాల పైన పెద్దగా ఫోకస్ చేయలేదు.


పవన్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయి.డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ , డైరెక్టర్ సుజిత్ తో OG, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రాలు మధ్యలో ఆగిపోయాయి.ఈ మూడు సినిమాలు ఆగిపోవడంతో ఏ సినిమాలు ఎప్పుడు వస్తాయనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.. డేట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఇందులో కొంతమంది డైరెక్టర్లు ఇతర హీరోలతో చేయడానికి సిద్ధమవుతున్నారు. సుజిత్ మాత్రం OG సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మరో 15 నుంచి 20 రోజులపాటు పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే చాలు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.


అయితే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ డేట్ లను సైతం ఇచ్చేలా కనిపించలేదు.తాజాగా చిత్ర బృందం OG సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది..DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. తమ ట్విట్టర్ నుంచి ఇలా తెలియజేస్తూ.. ఏం జరిగినా తగ్గేదేలే అని తెలియజేశారు కొత్త ఏడాది విషెస్ తెలియజేస్తూ యాంగ్రీ జీతాలాగా కొత్త ఏడాదిలోకి జంప్ అవుతున్నామంటూ గివెన్ ఇచ్చేది లే అంటూ తెలియజేశారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో పాటు నానితో సరిపొద శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు.. ఈ ఏడాది ఎన్నో పండుగలు సోమవారమే వస్తున్నాయి.. ఇంకేం సరిపోదా ఈ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయండి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: