తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు , ఖలేజా అనే రెండు మూవీ లు రూపొందాయి. ఇందులో అతడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... ఖలేజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెర ద్వారా మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది.
ఇకపోతే వీరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ సినిమా కావడంతో గుంటూరు కారం మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మూడవ పాట అయినటువంటి "కుర్చీ మడతపెట్టి" అంటూ సాగే పాటను విడుదల చేసింది.
ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయం లోనే 9.52 మిలియన్ వ్యూస్ ను ... 321.8 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని మూడవ పాటకు అద్భుతమైన రెస్పాండ్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించగా ... రమ్య కృష్ణ , జయరామ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.