పుష్ప -2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి సిద్ధం.!!

Divya
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప ది రైజ్.. ఈ సినిమా 2021లో విడుదలై దాదాపుగా 373 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో భారీ విజయాన్ని అందించింది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. ఈ చిత్రానికి అల్లు అర్జున్ నటనకు గాను ఉత్తమ నటుడుగా కూడా జాతీయ అవార్డును మొట్టమొదటిసారి అందుకోవడంతో అభిమానులకు సైతం ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఈ చిత్రంలోని డైలాగులు పాటలు ఇప్పటికీ అక్కడక్కడ రిల్స్ వినిపిస్తూనే ఉంటాయి.

దీంతో సుకుమార్ పుష్ప-2 సినిమాని మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డారు.. పుష్ప సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అభిమానులు ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రావడానికి ఇక కేవలం 226 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. అంటే ఆగస్టు 15 2024 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించబోతున్న తెలుగు సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇందులో రష్మిక ,అనసూయ ,సునీల్ ,ఫహద్ ఫాజిల్ తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు.. పుష్ప-2 సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్.. ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభించింది. ఇందులో అల్లు అర్జున్ ఎన్నో విభిన్నమైన గెటప్పులలో కనిపించబోతున్నారు. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల చేత ఆగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ తో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు పుష్ప-2 ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: