ఈసారి సంక్రాంతి రిలీజ్ లు మాత్రం దాదాపు క్లీన్ గానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా సెన్సార్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 12 వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సెన్సార్ యూ ఏ సర్టిపికెట్ వచ్చింది. దీంతో ఈ మూవీకి సెన్సార్ నుంచి ఎలాంటి అడ్డంకులు లేవని తేలిపోయింది. ఎలాంటి కట్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక విక్టరి వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం సైంధవ్ కూడా జనవరి 13 నరిలీజ్ అవుతుంది. ఈ మూవీకి కూడా సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికెట్ వచ్చింది.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం సినిమా కూడా క్లీన్ గానే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాల్లో మరీ ఓవర్ గా హింస ఉండదు. అసభ్యతకు అయితే అస్సలు ఛాన్సే ఉండదు. ఇంతవరకూ అసలు ఆయన సినిమాలకు ఏ సర్టిఫికెట్ వచ్చింది కూడా లేదు. దీంతో గుంటూరు కారం సినిమా కూడా క్లీన్ గానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఈగిల్ సినిమా కూడా జనవరి 13న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా కూడా ఎలాంటి కట్ లేకుండానే రిలీజ్ అవుతుందని సూపర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ రిలీజ్ అవుతుందా? లేదా? అని సస్పెన్స్ కొనసాగింది. తాజాగా ఈ సినిమా గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. జనవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకి కూడా సెన్సార్ నుంచి క్లీన్ సర్టిఫికెట్ లభించే అవకాశం ఉంది. ఇలా సంక్రాంతి పండుగ రిలీజ్ లన్నీ దాదాపు క్లీన్ గానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలన్నిటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత హనుమాన్, తరువాత సైందవ్, తరువాత నా సామిరంగా, తరువాత ఈగల్ సినిమాలు ఉన్నాయి. మహేష్ సినిమాకి రికార్డు స్థాయిలో థియేటర్లు ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ నెట్టింటా డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు.మరి మూవీ టీం మహేష్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుందో లేదో చూడాలి.