Vd-12: మళ్లీ శ్రీ లీల విజయ్ దేవరకొండ మూవీ..!!

Divya
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమానే ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నది.. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేశారు.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా కంటే ముందుగానే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు.

షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ని కూడా మొదలుపెట్టారు.. మళ్ళీ ఏమైందో తెలియదు అని ఒకసారి గా సినిమాని ఆపేశారు. ఆ తర్వాత డైరెక్టర్ పరశురామ్ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లారు..ఫస్ట్ షెడ్యూల్ ని కూడా ఇటీవలే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.. ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్లీ కొత్తగా సినిమాని మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది గౌతమ్ తిన్ననూరి.. గత కొన్ని రోజులగా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు.. హీరోయిన్గా శ్రీ లీల ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్తలు మాత్రం ఎక్కువగా వినిపించాయి.

అయితే ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ 12వ సినిమా షూటింగ్ షెడ్యూల్ మొదలు కాబోతుందని ఈ ఏడాది మార్చిలో రెగ్యులర్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుసగా శ్రీలిల డేట్లు బిజీగా ఉండడం చేత ఈ సినిమాని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం.. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిన్న సినిమా అంటే ఇందులో నిజం లేదు.. ఎందుకంటే ఇందులో విజయ్ దేవరకొండ ని పోలీసు ఆఫీసర్గా చూపించబోతున్నాట్లు తెలుస్తోంది. నిర్మాత నాగు వంశీని ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: