చిరంజీవి... రవితేజ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

frame చిరంజీవి... రవితేజ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతుంది. అందులో భాగంగా మూవీ బృందాలు ఈ సినిమాలకు సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 156 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం తెరకెక్కిస్తూ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే కొన్ని రోజులు అవుతున్న ఇప్పటి వరకు చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఈ నెల చివరన గాని వచ్చే నెల ప్రారంభంలో కానీ చిరంజీవి మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాలో నిర్మిస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోయిన్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రవితేజ మరియు కొంత మంది ఇతరులపై ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా ఈగల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: