బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా టైటిల్...గ్లిమ్స్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా ... తమన్నా ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
 


ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడికి మంచి క్రేజ్ లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ రాక్షసుడు సినిమాను మినహాయిస్తే ఈయనకు ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించలేదు. ఈ నటుడు కొంత కాలం క్రితం వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించిన చత్రపతి సినిమాలో హీరోగా నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ హిందీలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టించి.  


ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు భీమ్లా నాయక్ మూవీ కి దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు గ్లీమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు "టైసన్ నాయుడు" అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ మూవీ గ్లీమ్స్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో శ్రీనివాస్ అదిరిపోయే రేంజ్ యాక్షన్ సన్నివేశాలు చేస్తూ కనిపించాడు. దీనితో ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతుంది. ఈ మూవీ.లో శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: