టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్
హీరో తేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్
సినిమా హనుమాన్. ఇందులో యంగ్
బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్గా కనిపించబోతోంది. యంగ్ అండ్ డైనమిక్
డైరెక్టర్ ప్రశాంత్
వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిన్న
సినిమా అయినప్పటికీ కంటెంట్ ఏదో కాస్త బాగా అనిపించడంతో స్టార్ హీరోల సినిమాకి పోటీగా హనుమాన్ రాబోతోంది. దీంతో ఈ
సినిమా పైనే భారీ అంచనాలను పెట్టుకున్నారు ప్రేక్షకులు. కాగా ఇప్పుడు పాన్
ఇండియా వైడ్ గా
సినిమా ప్రమోషన్స్ని
సైతం శరవేగంగా జరుపుతున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగా స్టార్
చిరంజీవి పాత్ర కూడా ఉండబోతోంది అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా సంగతి మన అందరికీ తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ కూడా ఉందని టాక్. ప్రస్తుతానికి ఈ సినిమాలో
మెగాస్టార్ ప్రజెన్స్ ఉందో లేదా అనేది సస్పెన్స్ గా ఉన్న..
సినిమా కోసం
మెగాస్టార్ ఎంట్రీ మాత్రం కన్ఫామ్ అయిపోయింది.
మెగాస్టార్ ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు హాజరు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.