తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
తేజ సజ్జ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం
తేజ సినిమాల్లో
హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన హనుమాన్ అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ కి
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను నిరంజన్
రెడ్డి నిర్మించాడు. ఈ
మూవీ ని చాలా రోజుల క్రితమే 2024
సంక్రాంతి కనుకగా
జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించింది.
ఇక ఆ తర్వాత అనేక సినిమాలు
సంక్రాంతి బరిలోకి వచ్చాయి. అందులో భాగంగా ప్రస్తుతం విడుదల తేదీలను ప్రకటించిన సినిమాల ప్రకారం ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా ఏకంగా 5 తెలుగు స్టేట్
మూవీ లు విడుదల కానున్నాయి. దానితో ఈ సంవత్సరం
సంక్రాంతి కి విడుదల కాబోయే సినిమాలకు
థియేటర్ ల కొరత భారీగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న హనుమాన్ సినిమాకు మాత్రం చాలా తక్కువ
థియేటర్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే తాజాగా ఈ
సినిమా నిర్మాత అయినటువంటి నిరంజన్
రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన హనుమాన్ సినిమాకి
థియేటర్ లు ఎందుకు దొరకడం లేదు అనే విషయం పై స్పందించాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా హనుమాన్
మూవీ నిర్మాత నిరంజన్
రెడ్డి మాట్లాడుతూ ... చాలా మంది
థియేటర్ ల ఓనర్లు మేము మా
థియేటర్ లలో హనుమాన్ సినిమానే వేయాలి అని అనుకుంటున్నాము. కాకపోతే మమ్మల్ని కొంత మంది హనుమాన్ సినిమాను వేయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా నిరంజన్
రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.