గోపీచంద్ భీమా టీజర్ ఈరోజే.. ఎప్పుడంటే..?
ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ టీజర్ అప్డేట్ ను కూడా తెలియజేశారు.. భీమా టీజర్ ఈ రోజున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ టీజర్ టైమ్ అని కూడా ప్రకటిస్తూ ఈరోజు మధ్యాహ్నం 1.11 గంటలకు టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. గతంలో కూడా ఎన్నో చిత్రాలలో పోలీస్ ఆఫీసర్గా గోపీచంద్ అదరగొట్టేశారు.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా సలార్ ఫేమ్ బాస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా గోపీచంద్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉండడంతో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా గోపీచంద్ తగ్గించినట్లుగా తెలుస్తోంది. మరి భీమా సినిమాతో ప్రేక్షకులను , అభిమానులను సైతం ఖుషి అయ్యేలా చేస్తారేమో చూడాలి మరి. దీంతో గోపీచంద్ వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకుంటూ తన స్టామినా చూపించాలనుకున్నప్పటికీ ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నారు. మొదట విలన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో చిత్రాలలో నటించారు. అవసరమైతే మళ్లీ విలన్ గా కూడా చేస్తానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు గోపీచంద్.