కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. గత సంవత్సరం రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ 1000 కోట్ల మార్క్ అందుకొని హీరోగా యశ్ మార్కెట్ ని మరింత పెంచింది. దీంతో తన తదుపరి ప్రాజెక్టు విషయంలో యశ్ ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఆచితూచి అడుగులు వేశాడు. అందుకే కేజిఎఫ్ తర్వాత కొత్త సినిమాని అనౌన్స్ చేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. యశ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి ఈ మధ్యే తన కొత్త సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రానికి 'టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్' అనే వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. గీత మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతోనే కరీనాకపూర్ సౌత్ లోకి ఆరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని, యశ్ తో కలిసి చేసేందుకు కరీనా కూడా ఆసక్తిగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కరీనాకపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉంటారట.
యశ్ టాక్సిక్ మూవీ లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు సమాచారం. కరీనా కపూర్ కంటే ముందు సినిమాలో యశ్ కి జోడిగా సాయి పల్లవి, శృతిహాసన్ వంటి హీరోయిన్స్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తలకెక్కనున్న ఈ సినిమాలో ఎస్ క్యారెక్టర్లేజేషన్ గ్రే షేడ్స్ ని కలిగి ఉంటుందట సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రధాన పాత్రలు ఉండడంతో ఆ పాత్రల కోసం కరీనాకపూర్, శృతిహాసన్, సాయి పల్లవి లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.