సలార్ బ్లాక్ బస్టర్.. కానీ ఆ రికార్డ్ కొట్టేలా లేదుగా?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో అదిరిపోయే కామ్ బ్యాక్ హిట్ కొట్టాడు.బాహుబలి సిరీస్ తరువాత దాదాపు ఆరేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అయిన ప్రభాస్ ఓకే ఒక్క సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించారు.KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. 2023లో భారీ విజయం సాధించిన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా అలాగే కలెక్షన్స్ లోనూ 675 కోట్ల దాకా వసూల్ చేసింది సలార్ సినిమా. ఇదిలా ఉంటే తాజాగా సలార్ తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలన విజయం సాధించింది.తాజాగా నైజం ఏరియాలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్ .. నైజం ఏరియాలో 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది సలార్ సినిమా. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఓ అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.



ఇక ఇప్పటికి కూడా థియేటర్స్ దగ్గర సలార్ హవా కొనసాగుతోంది. తాజాగా నైజం ఏరియాలో ఈ సూపర్ రికార్డ్ క్రియేట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా 1000 కోట్ల మైలు రాయి అందుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి, షారుఖ్ ఖాన్ వీరు ఇద్దరు మాత్రమే 1000 కోట్ల సినిమాలు తీశారు. వీరు ఇద్దరు ఏకంగా రెండు సార్లు ఈ ఘనత సాధించారు. ఇక యానిమల్ సినిమా కూడా 900 కోట్ల వసూళ్ల వద్దనే ఆగిపోయింది. సలార్ కూడా వెయ్యి కోట్లు అందుకోవడం కష్టంగానే ఉంది. మరి చూడాలి ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని కోట్లు రాబడుతుందో..ఇక సలార్ మొదటి పార్ట్ ఘనవిజయం సాదించడమతొ ఇప్పుడు సెకండ్ పార్ట్ పై కూడా అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరి ఈ సెకండ్ పార్ట్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: