గుంటూరు కారం: ఫ్యాన్స్ కి కిక్కునిచ్చే న్యూస్?

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ తోనే ఉన్నారు. సంక్రాంతికి మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న గుంటూరు కారం మూవీ మిడ్ నైట్ షోస్ ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. తెలుగులో టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేష్ సినిమా అంటే రెండు రాష్ట్రాల్లో హంగామా మాములుగా ఉండదు.అందుకే సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే మిడ్ నైట్ నుంచి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తారు.కోవిడ్ లాక్ డౌన్ తర్వాత నుంచి స్టార్ సినిమాలకు కూడా మిడ్ నైట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈమధ్య కాలంలో మళ్లీ ఆ సందడి మొదలైంది. అభిమాన హీరో సినిమా ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్ షో చూస్తేనే సినిమా చూసినట్టుగా భావిస్తారు వీరాభిమానులు. వారి కోసమే సింగిల్ స్క్రీన్స్, మల్టీ ప్లెక్స్ లో మిడ్ నైట్ షోస్ ని ప్లాన్ చేస్తారు. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే ఫస్ట్ ఆట మహేష్ సొంత థియేటర్ ఏ.ఎం.బి మాల్ లో ఉంటుందని సమాచారం తెలుస్తుంది.



ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్ లో మిడ్ నైట్ షోస్ ఉంటాయని సమాచారం తెలుస్తుంది. ఈ షోస్ విషయంలో జనవరి 9 కల్లా క్లారిటీ వస్తుందని సమాచారం తెలుస్తుంది.అయితే దర్శక నిర్మాతలు మాత్రం మాక్సిమం నెంబర్స్ ఎర్లీ షోస్ పడేలా ప్లాన్ చేస్తున్నారట. మిడ్ నైట్ షోస్ తో పాటుగా ఎర్లీ మార్నింగ్ 4 గంటల షోస్ కూడా కొన్ని ప్లానింగ్ లో ఉన్నాయని సమాచారం తెలుస్తుంది.సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబో మీద ఉన్న అంచనాలు.. పైగా మహేష్ నుంచి వస్తున్న ఊర మాస్ సినిమాగా రాబోతున్న గుంటూరు కారం మీద భారీ హైప్ తీసుకొచ్చాయి.ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సూపర్ క్రేజ్ తీసుకు రాగా త్వరలో రిలీజ్ కాబోతున్న ట్రైలర్ తో సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. ఇక గుంటూరు కారం సినిమాలో యంగ్ అండ్ హాట్ బ్యూటీలు శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: