సాధారణంగా ఏ సిని ఇండస్ట్రీలో అయినా శత్రువులు ఉండడం సహజం. పైకి స్నేహంగానే కనిపించినప్పటికీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు మనల్ని తొక్కేయా లా ఎలా మనల్ని వెనుకకి నెట్టేద్దామా అని చాలామంది చూస్తూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు కి సంబంధించిన ఒక వార్త కూడా ఇలానే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే మహేష్ బాబు చాలా మంచి వ్యక్తి ఉన్నది. ఉన్నట్లుగానే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ముందు ఒకలాగా వెనుక ఒకలాగా అసలు ఉండరు. ఒకసారి ఒక మాట మరోసారి మరో మాట ఎప్పుడూ మాట్లాడరు.
అయితే మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటికీ చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల తో కలిసి సినిమాలు చేశారు. కానీ ఒకే ఒక ప్రొడ్యూసర్ మహేష్ బాబుని చాలా దారుణంగా అవమానించినట్లు గా తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న ఆయన మహేష్ బాబుతో సినిమా తీయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదట. ఒక్కడు సినిమాను ఆయన ప్రొడ్యూస్ చేయాల్సింది . కానీ ఒక్కడు సినిమా మహేష్ చేస్తే ఫ్లాప్ అవుతుందని తెలిసి మరో హీరోతో చేద్దామంటూ బ్యాక్గ్రౌండ్ లో స్కెచ్ వేశారట . కానీ కృష్ణ సపోర్ట్ తో ఒక్కడు సినిమా మహేష్ కి దక్కింది .
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చాలా ఈవెంట్స్ లోనూ ఆ ప్రొడ్యూసర్ ఎదుటిపడిన ఆయనే మహేష్ బాబుతో మాట్లాడేవాడు కాదట. తప్పు చేసామని తలదించుకునేవాడు . మహేష్ బాబు కూడా చూసి చూడనట్టే వెళ్లిపోయేవాడట. మనల్ని అవమానించిన వాళ్ళు మనం దానికి పనికిరాం అనుకోని మనల్ని హేళన చేసిన వాళ్ల ముందే మనం స్టార్ గా నిలబడితే ఆ కిక్కే వేరు అంటున్నారు మహేష్ బాబు అభిమానులు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!