హాట్ టాపిక్ గా మారిన మంచు విష్ణు వారసుడు !

Seetha Sailaja
ఇప్పటికే అక్కినేని నందమూరి వంశానికి చెందిన మూడవ తరం హీరోలు ఇండస్ట్రీలో తమ హవా చాటుకుంటున్నారు. ఇప్పుడు ఈలిస్టులోకి మంచు కుటుంబం కూడ చెరిపోయింది. మోహన్ బాబు మనవడు మంచు విష్ణు కొడుకు అవరం సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కేవలం 5సంవత్సరాల వయసు ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు నటిస్తున్న మొదటి సినిమా పాన్ ఇండియా మూవీ కావడం అతడి అదృష్టాన్ని తెలియచేస్తోంది.



గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు ఇప్పుడు ఏకంగా భారీ బడ్జెట్ తో న్యూజీలాండ్ దేశంలో చిత్రీకరిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో మంచు విష్ణు కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం కబోతున్నాడు. ఈవిషయాన్ని స్వయంగా మంచు విష్ణు తెలియచేస్తూ తన కొడుకుతో తాను తీయించుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.



ఈఫోటో షేర్ చేయబడ్డ కొద్ది క్షణాలలోనే అది వైరల్ గా మారింది. మంచు విష్ణు కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో విష్ణు ఈసినిమాలో కన్నప్పగా నటించడమే కాకుండా ఈసినిమా పై భారీ అంచనాలు పెరిగే విధంగా ఈమూవీ నిర్మాతలు ఈమూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు.



ప్రస్తుత తరం ప్రేక్షకులు గతంలో విడుదల అయిన కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ చూసిన సందర్భాలు చాల తక్కువగా ఉంటాయి. నేటితరం ప్రేక్షకులకు ‘భక్తకన్నప్ప’ గురించి పెద్దగా అవగాహన ఉండదు. దీనికితోడు ఈసినిమా అంతా విదేశాలలో తీస్తున్న పరిస్థితుల్లో కన్నప్ప మూవీలో ఏదో ఒక స్పెషాలిటీ కనిపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి పురాణ కథలను సినిమాలుగా తీయడానికి అనేకమంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇలాంటి సినిమాల పట్ల ప్రేక్షకుల నుండి స్పందన వస్తూనే ఉంటుంది. దీనికితోడు మలయాళ హీరో మోహన్ లాల్ తో పాటు అనేకమంది సీనియర్ ఆర్టిస్టులు ఈమూవీలో నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీ ఫైనల్ రిజల్ట్ గురించి ఆతృతతో ఎదురుచూస్తున్న పరిస్థితులలో ఈమూవీ షూటింగ్ సమయంలో మంచు విష్ణుకు గాయం అవ్వడంతో ఈమూవీ షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: