సినిమా కధల కొత్త ట్రెండ్ !

Seetha Sailaja
తెలుగు సినిమా కథలు ఏదో ఒక ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటాయి. నాన్నా అమ్మ చెల్లి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు గతంలో చాలమటుకు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అక్కినేని ఎన్టీఆర్ ల కాలం నుండి చెల్లి తల్లి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు అనేకం హిట్ అయ్యాయి. ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో ఒకనాటి చెల్లి తల్లి సెంటిమెంట్ సినిమా కథలు చాల తక్కువగా వస్తున్నాయి.



అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన అక్కినేని ఎన్టీఆర్ లు నటించిన అనేక చెల్లి సెంటిమెంట్ కథలు అప్పట్లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసెంటిమెంట్ కథలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న రెండు భారీ సినిమాల కథలు ‘సముద్రం’ సెంటిమెంట్ తో రూపొందుతూ ఉండటం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.



ఈసంవత్సరం సముద్ర నేపధ్యంలో రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మొదటి స్థానంలో కొనసాగుతున్నది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘దేవర’ ఈమూవీ కథ సముద్ర నేపధ్యంలో జరుగుతుంది. పూర్తి గ్రాఫిక్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీదేవి కూతురు జాహ్నవీ ఈమూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.


ఇక ఈలిస్టులో రెండవ స్థానంలో కొనసాగుతున్న మూవీ నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్’ మూవీ కథ కూడ పూర్తి సముద్ర నేపధ్యంలో కొనసాగుతుంది. ప్రేమకథకు ఒక విభిన్నమైన ట్రీట్ మెంట్ తో యాక్షన్ థ్రిల్ రెండూ మిక్స్ చేస్తూ దర్శకుడు చందూ మొండేటి భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతి రేస్ కు వచ్చిన చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ కూడ సముద్ర నేపద్యంలో కొనసాగిన కథ. ఈసినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ తో మొదలైన ఈ కొత్త సినిమా కథల ట్రెండ్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: