ఓటీటీ లో ఏంట్రీ కి రంగం సిద్ధం చేసుకున్న నితిన్ మూవీ....!!

murali krishna
టాలీవుడ్ కింగ్ హీరో నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది.విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల అయింది. కానీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా పరాజయాన్ని మూటకట్టుకుంది. వక్కంతం వంశీ మంచి రైటర్ కానీ దర్శకత్వంలో తన ప్రతిభను చాటలేక పోయాడు. ఈ సినిమాకి పోటీగా నాని హీరోగా నటించిన హాయ్ నాన్న మూవీ కూడా విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ రావడంతో నితిన్ సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలువలేకపోయింది..నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్‌ట్రా - ఆర్డినరి మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా డిసెంబర్‌ 8న విడుదలైంది.కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కవగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్‌ కాలేదని చెప్పవచ్చు. రైటర్‌గా మెప్పించిన వక్కంతం వంశీ.. డైరెక్టర్‌గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు కొంత నెగటివ్‌ టాక్‌ వచ్చింది.ఇదే సమయంలో నాని నటించిన హాయ్‌ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్‌ రావడంతో నితిన్‌ సినిమా కలెక్షన్స్‌పై కూడా ప్రభావం చూపింది. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సంక్రాంతికి ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రాజశేఖర్ ఒక డిఫరెంట్‌ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, పవిత్రా నరేష్, హైపర్ ఆది తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: