Glimp: అదరగొట్టేస్తున్న చైతు- సాయి పల్లవి తండేల్ గ్లింప్స్..!!

Divya
తెలుగు ఇండస్ట్రీలో యువ సామ్రాట్ నాగచైతన్య.. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాని తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో సాయి పల్లవి కథానాయకగా నటిస్తుండడంతో ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తండేల్ సినిమా నుంచి నిన్నటి రోజున గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాలవల్ల ఇది ఆలస్యం అయ్యిందని మళ్లీ తెలియజేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందడంతో.. అనుకున్నట్టుగానే గడిచిన కొన్ని నిమిషాల క్రితం తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు..


ఈ తండాల సినిమా కథ చిత్ర బృందం ఇదివరకే తెలియజేశారు సముద్ర వేటకు వెళ్లిన కొంతమంది జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ వెళ్లడం అక్కడ చిక్కుకోవడం ఆ తర్వాత వారు ఎలా బయటికి వచ్చారు. అనే జరిగిన ఒక యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు.. ఈ చిత్రంలో ప్రేమ కథ దేశభక్తి అంశాలను సైతం జోడించి మరి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన తండేల్ గ్లింప్స్  అదిరిపోయిందంటూ పలువురు నేటిజెన్లు తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా ఇందులో నాగచైతన్య ఫుల్ రఫ్ గడ్డంతో మాస్ క్యారెక్టర్ లో కనిపించారు సాయి పల్లవి చూసిన అభిమానులు కూడా అదే జోష్తో కనిపిస్తున్నారు. ముఖ్యంగా తండేల్ సినిమాలోని నాగచైతన్య డైలాగులు అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. దేశభక్తి లవ్ ప్రేమ కథాంశాలలోని డైలాగులు కూడా అందరిని ఆకర్షిస్తున్నాయి చివరిలో సాయి పల్లవి ని చూపించిన తీరు అద్భుతంగా ఉందంటూ పొగిడేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. మరి ఏ మేరకు ఈ సినిమా అటు సాయి పల్లవి నాగచైతన్య కెరియర్ను మలుపు తిప్పుతుందో చూడాలి మరి. ఇటీవలే నాగచైతన్య ఓటీటి లో విడుదల చేసిన దూత సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: