మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద పాన్ ఇండియా స్టార్ గా సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల రామ్ చరణ్ కి దేశావ్యాప్తంగా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కే RC16 కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాని ఎంతో ఇష్టంగా చేస్తున్నాడు.అభిమానులకి ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాకి అదిరిపోయే కాస్టింగ్ క్రూని సెలెక్ట్ చేస్తుండడంతో ఆ అంచనాలు మరింత హీటెక్కుతున్నాయి.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. నేడు జనవరి 6న రెహమాన్ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ ఇంకా చిత్ర యూనిట్ విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతలు రెహమాన్ తో మూవీ యూనిట్ ఉన్న ఫోటోలను చేశారు.
ఆ ఫొటోల్లో దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబుతో పాటు నిర్మాతలు కూడా కనిపిస్తున్నారు.ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పుడే మొదలయ్యిపోయాయా..? అని ప్రశ్నలు వేస్తున్నారు. ఆ పిక్స్ చూస్తుంటే మ్యూజిక్ పనులు మొదలయ్యినట్లే తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో మొదలు పెట్టబోతున్నారు. వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.అలాగే ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారట. ఈ విషయాన్ని కూడా తన సన్నిహితులతో శివరాజ్ కుమార్ స్వయంగా తెలియజేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఇక రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే దాకా వేచి చూడాలి.