అఫిషియల్ : "నా సామి రంగ" షూటింగ్ పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అషిక రంగనాథ్ ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా కనిపించబోతుంది.


 ఇకపోతే ఈ సినిమాను మొదటగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కానీ చాలా రోజుల పాటు ఈ మూవీ విడుదల తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావకపోవడంతో ఈ మూవీ సంక్రాంతి కి విడుదల కావడం కష్టమే అని వార్తలు వచ్చాయి.


కానీ ఈ చిత్ర బృందం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: