ముక్కు అవినాష్ సూసైడ్ చేసుకోకుండా ఆపింది ఆమెనా..?
అంతేకాకుండా పలు షోలకూ యాంకర్ గా కూడా చేస్తూ మంచి క్రేజ్ అందుకున్నారు. ముక్కు అవినాష్ ఇటివలె వివాహ బంధంలోకి అడుగుపెట్టి త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పలు రకాల ఈవెంట్లు షోలతోనే భారీగా సంపాదిస్తున్నారు ముక్కు అవినాష్.. ఒకప్పుడు ముక్కు అవినాష్ ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నారని తన కష్టాలను బిగ్ బాస్ సోలో పాల్గొన్నప్పుడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా అవినాష్ తమ్ముడు ఎమోషనల్ అవుతూ ఎవరికీ తెలియని విషయాలను తెలియజేశారు.
అవినాష్ తమ్ముడు ఇలా మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఆ సమయంలోనే తాము కొత్త కారు ఇల్లును కూడా కొన్నామని అయితే అది లోన్ ద్వారా కొనగా ఆ లోన్ చెల్లించడానికి తమ దగ్గర ఎలాంటి డబ్బు లేకపోవడంతో emi లు కట్టమంటూ నోటీసులు వచ్చాయని ఇవే కాకుండా బయట అప్పులు కూడా చేశామని దీంతో తన అన్న చాలా కృంగిపోయాడని తెలిపారు.. కేవలం ఆ సమయంలో బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో రూ .10లక్షలు కట్టి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చారని తెలిపారు.. ఆ సమయంలో శ్రీముఖి 5 లక్షలు గెటప్ శ్రీను లక్ష చమ్మక్ చంద్ర 2 లక్షల రూపాయలు ఇచ్చారని ఎమోషనల్ అవుతూ తెలిపారు అవినాష్ సోదరుడు..