సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే వీరి కాంబోలో అతడు , ఖలేజ అనే రెండు మూవీ లు రూపొందాయి. ఈ సినిమాలలో అతడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోగా ... ఖలేజా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కాకపోతే ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై ప్రసారం అయిన ప్రతి సారి కూడా ప్రేక్షకులను అదిరిపోయి రేంజ్ లో అలరిస్తూ వస్తుంది.
దానితో కొంత ఆలస్యంగా అయిన కూడా వీరి కాంబోలో రూపొందిన ఖలేజా సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే అతడు , ఖలేజా లాంటి మంచి సినిమాలు విరి కాంబో లో రావడంతో గుంటూరు కారం సినిమాపై కూడా మహేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాను చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మించాగా ... శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో మహేష్ కి జోడిగా నటించారు.
రమ్య కృష్ణ , జయ రామ్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే "యూ ఎస్ ఏ" లో మహేష్ బాబు కు అదిరిపోయే రేంజ్ మార్కెట్ ఉన్నది అనే విషయం మన అందరికీ తెలిసిందే. దానితో గుంటూరు కారం సినిమాని "యూ ఎస్ ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ప్రీమియర్స్ ను "యూ ఎస్ ఏ" లో 5408 షో లను ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా భారీ ఎత్తున ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో ఈ చిత్ర బృందం ప్రదర్శించబోతుంది.