భారీ ధరకు అమ్ముడుపోయిన దేవర ఆడియో రైట్స్..!!
దేవర సినిమా నుంచి ఇటీవల ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు, ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను సైతం చిత్ర బృందం విడుదల చేశారు.. ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది... ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ మరొక అప్డేట్ ను సైతం అభిమానుల కోసం తెలియజేశారు..
అదేమిటంటే దేవర సినిమా ఆడియో హక్కులను సైతం ప్రముఖ మ్యూజిక్ సంస్థలలో ఒకటైన..T సిరీస్ సంస్థ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతవరకు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా అభిమానులను మెప్పించే విధంగా ఉంటుందని చిత్ర బృందం ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా కొరటాల శివ కూడా గతంలో ఆచార్య సినిమాతో ఫ్లాప్ తో చాలా నష్టపోయారు. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ధీమాతో దేవర సినిమాని తెరకెక్కిస్తున్నారు.