రూటు మార్చిన బేబమ్మ.. సక్సెస్ అయ్యేనా..?
ఆ తర్వాత అరడజనుకుపైగా సినిమాలు రావడంతో పాటు వాటన్నిటిని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేసింది. అయితే వచ్చిన అవకాశం నల్ల ఓకే చేయడంతో ఈమెకు పెద్ద చిక్కు పడింది..ఆ సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. దాదాపుగా వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాపులు అవ్వడంతో ఈమెకు అవకాశాలు సైతం రాలేదు.. దీంతో కథల ఎంపిక విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తమిళంలో కొన్ని చిత్రాలలో మాత్రమే నటిస్తోంది. తెలుగులో అయితే ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్ ని అమాంతం పోగొట్టుకుంది.
దీంతో కృతి శెట్టి హీరోయిన్గా రాణించాలంటే కచ్చితంగా గ్లామర్ పాత్రలు చేయాల్సిందే అనేంతగా మారిపోయింది. అందుకే కృతి శెట్టి సోషల్ మీడియాలో స్కిన్ షో చేయడానికి ఎలాంటి మొహమాటం పడలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ఎలాంటి ఫోటో షూట్లలో నైనా సరే ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఉప్పెనతో వచ్చిన క్రేజీని వాడుకోవడంలో ఫెయిల్యూర్ గా మారిన ఈ ముద్దుగుమ్మ ఇక మీదటైనా సినిమాలు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చూస్తోంది.. గ్లామర్ టచ్ ఉన్న పాత్రలను అసలు మిస్ కాకూడదని ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా మలయాళం లో ఒక సినిమా చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తోంది.