టీవీల్లోకి వచ్చేస్తున్న లియో మూవీ..?

Divya
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అయింది ఈ సినిమాకి మిక్సడ్ టాక్ రావడం జరిగింది. థియేటర్ రన్ టైం పూర్తి అయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా అన్ని భాషలలో స్ట్రిమ్మింగ్ కాబోతోంది.


లియో సినిమా తెలుగు వర్షన్ లో టీవీ లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా లియో సినిమా జనవరి 15వ తేదీన సాయంత్రం 6:30 నిమిషాలకు జెమినీ టీవీలో టెలికాస్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జెమిని టీవీ వారు వెల్లడించారు. అలాగే బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇందులో నటించారు.. వీరితోపాటు అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించారు.

మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి అదిరిపోయింది అని తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో పథకం పైన ఈ చిత్రాన్ని నిర్మించారు.. లోకేష్ సినిమాటిక్ యూనివర్శిటీలో భాగంగానే లియో సినిమాని తెరకెక్కించారు.. గతంలో లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రం సినిమాలకు లింకుగా లియో సినిమాని రిలీజ్ చేశారు.. ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే ఒక హాలీవుడ్ చిత్రాన్ని తీసుకొని ఈ సినిమాగా తెరకెక్కించినట్లు సమాచారం. మరి బుల్లితెర పైన ఈ సినిమా ఎలాంటి రికార్డులను సైతం కొల్లగొడుతుంది తెలియాలి అంటే టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే. దళపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ డైరెక్టర్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: