ఓటీటీలో దూసుకుపోతున్న నాని హాయ్ నాన్న..!

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హాయ్ నాన్న. నూతన దర్శకుడు శౌర్య వ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హద్దుకుంది. కాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ నాలుగు రోజుల క్రితం హాయ్ నాన్న సినిమా ఓటీటీలో విడుదలై దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా టాప్ లో కొనసాగుతూ ట్రెండింగ్లో కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా టాప్ టెన్ లో మూడు స్థానాలను సొంతం చేసుకుంది హాయ్ నాన్న సినిమా. 


కూతురు సెంటిమెంట్ మంచి ప్రేమ కథ సినిమాగా అలరించిన హాయ్ నాన్న సినిమాకి ఓటిటీ లవర్స్ సైతం ఫిదా అవుతున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఏకంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో మాత్రం టాప్ వన్ లో కొనసాగుతోంది. అనంతరం హిందీలో ఐదువ స్థానం తమిళంలో పదవ స్థానంలో దూసుకుపోతోంది.   దీంతో నానీ ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని హీరోగా నటించిన  హాయ్ నాన్న  లోని కొన్ని ఎమోషన్ సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం నాని 'సరిపోదా శనివారం'తో బిజీగా ఉన్నారు. 


వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో.. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న    నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తుండగా ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. భిన్నమైన కథాంశంతో ఇది రూపొందుతోంది. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా రానుంది. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వినోదానికి కూడా ఇందులో పెద్దపీట వేయనున్నారు. దీని తర్వాత 'బలగం' వేణు దర్శకత్వంలో నాని ఓ సినిమా చేసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: