పురిటి లోనే బిడ్డను కోల్పోయిన అవినాష్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

Anilkumar
జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంచి గుర్తింపును అనుకున్నాడు ముక్కు అవినాష్. ఇక ఈ కార్యక్రమంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ బిగ్ బాస్ అనే ఒక కార్యక్రమానికి వెళ్లాడు. ఆ తర్వాత మరింత బిజీ అయ్యాడు  అవినాష్. ఇకపోతే 2021లో అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల అవినాష్ భార్య తల్లి అయ్యింది అన్న విషయాన్ని సైతం వీరిద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకున్నారు. అనుజ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను తన బేబీ బంప్ ఫోటోలను సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.

అంతేకాదు తమ సీమంతానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సైతం తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వబోతున్నాము అంటూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక మరి కొద్ది రోజులలో ఈయన తండ్రి కాబోతున్నాడు అని అనుకునే లోపే వారి కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఇక అదే విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు  అవినాష్.. నేను ఏ విషయమైనా చెప్పాలి అనుకుంటే అది నా ఫ్యామిలీతో సమానమైన మీతో అన్ని విషయాలు పంచుకుంటానని. ఇక ఈ విషయం కూడా చెప్పే బాధ్యత నాదే కనుక అందరికీ ఈ విషయాన్ని చెబుతున్నాను

అంటూ అవినాష్ అసలు విషయం వెల్లడించారు. కొద్ది రోజులలో అమ్మానాన్నలుగా మారిపోతున్నామని ఎంతో సంతోషంగా ఉన్నాము కానీ కొన్ని కారణాలవల్ల మేము మా బిడ్డను కోల్పోయాము అంటూ అవినాష్ ఈ సందర్భంగా పురిటిలోనే తన బిడ్డ మరణించింది అనే విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటూ ఈయన ఈ విషయం చెప్పడంతో ఎంతోమంది రియాక్ట్ అవుతుంది తనకు ధైర్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: