భీమా సాటిలైట్, ఓటిటి డీటెయిల్స్ ఇవే?

Purushottham Vinay
కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో టాలీవుడ్  స్టార్ హీరో గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'భీమా' అనే సూపర్ టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.ఈ సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా  శాటిలైట్ హక్కులను స్టార్ మా టీవీ ఇంకా డిజిటల్ ఓటిటి హక్కులను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ గొప్ప సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో మాళవిక శర్మ యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికలుగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ బాగా ఆకట్టుకుంటుంది.



'యదా యదా హి ధర్మస్య..' అంటూ భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్ ఓవర్తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. 'ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా' అని బ్యాక్గ్రౌండ్లో ఓ వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ అవతారంలో పరిచయమయ్యారు హీరో గోపీచంద్. టీజర్ ఓపెనింగ్ లో ఆధ్యాత్మిక కంటెంట్తో మునులు, దుష్ట శక్తులు కనిపిస్తాయి.ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ ఎంట్రీ అద్భుతంగా ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన లార్జర్ దెన్ లైఫ్ కథగా ఉంటుందని ఈ టీజర్ చెప్పకనే చెప్పింది. గోపీచంద్ పోలీసు అవతార్లో సూపర్ గా కనిపించారు. ఖాకీలో పవర్-ప్యాక్డ్ లుక్లో గోపీచంద్ని చూడటం ఆయన అభిమానులకు, మాస్కి పెద్ద పండుగ. టీజర్లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక హర్ష తన అద్భుతమైన టేకింగ్తో ఆకట్టుకున్నారు.అలాగే స్వామి జె గౌడ కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: