ఓటీటీ లో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని మూవీ....!!
హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 4వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా దూసుకెళుతోంది.నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రస్తుతం (జనవరి 7) హాయ్ నాన్న తెలుగు వెర్షన్ ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. నేషనల్ వైడ్ గా ఈ మూవీ టాప్ ప్లేస్‍కు చేరింది. టాప్-10లో హాయ్ నాన్న హిందీ వెర్షన్ 5వ ప్లేస్‍లో ఉండగా తమిళ వెర్షన్ 10వ ప్లేస్‍లో ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఇండియా టాప్-10లో మూడు ప్లేస్‍ల్లో హాయ్ నాన్న ట్రెండ్ అవుతుంది.ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్‌టైన్‍మెంట్ నేడు పోస్ట్ చేసింది.
హాయ్ నాన్న సినిమాలో నాని మరియు మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకున్నారు.. నాని కూతురిగా నటించిన బేబి కియారా ఖన్నా కూడా ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో జయరాం, ప్రియదర్శి, నాజర్, విరాజ్ అశ్విన్ మరియు అంగద్ బేడీ ముఖ్యపాత్రలు పోషించారు.అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ఓడియమ్మ సాంగ్‍లో క్యామియో రోల్ చేసి తన డాన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది