విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్.. క్లారిటీ ఇచ్చిన టీం?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ, హాట్ హీరోయిన్ రష్మిక పెళ్లి చేసుకోనున్నారంటూ నెట్టింట పుకార్లు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఆశీర్వదించారని ఇక పెళ్లే తరువాయి అంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.వచ్చే ఫిబ్రవరి నెలలోనే విజయ్‌ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరగనుందంటూ సామాజిక మాధ్యమాల్లో , కథనాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ స్పందించింది. విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియాలో ఇలా వస్తోన్న వార్తలను ఏ మాత్రం నమ్మవద్దని కోరింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా కనిపించారు విజయ్, రష్మిక. ఈ రెండు సినిమాల్లో రష్మిక, విజయ్ ల స్క్రీన్ ప్రజెన్స్ అయితే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చాలామందికి కూడా ఈ జోడీ ఫేవరేట్ గా మారిపోయింది. అదే సమయంలో విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. పైగా వీరు తరచూ పార్టీలు, ఫంక్షన్లు, డిన్నర్లకు కలిసి వెళుతుండడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.



అయితే ఎప్పటికప్పుడు తమ డేటింగ్ వార్తలను తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు విజయ్, రష్మిక. తామిద్దరం మంచి స్నేహితులమంటూ పలు సందర్భాల్లో వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా మరోసారి విజయ్, రష్మికల ఎంగేజ్ మెంట్, పెళ్లి నెట్టింట బాగా వైరల్ గా మారాయి. అయితే ఎప్పటిలాగే విజయ్ టీమ్ వీటిని తీవ్రంగా కొట్టి పారేసింది.ఇక వీరు చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఖుషి సినిమాతో ప్లాప్ అందుకొని మళ్ళీ రాడ్డు దింపుకున్న విజయ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా రానున్నాడు. ఇందులో హిట్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి గీత గోవిందం ఫేమ్ పరశురామ్  దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రష్మిక మందన విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండియాలో ది మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మేనని చెప్పుకోవచ్చు. ఇటీవలే యానిమల్ సినిమాతో నేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రష్మిక. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ ఏకంగా రూ. 900 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రష్మిక నటిస్తున్న పుష్ప 2 పైనే అందరి దృష్టి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: