రిలీజ్ కు ముందే లాభాల బాటలో 'హనుమాన్'!

Anilkumar
ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాల్లో 'హనుమాన్' కూడా ఒకటి. పేరుకే చిన్న సినిమా అయినా ఆడియన్స్ లో ఈ మూవీపై హైప్ ఓ రేంజ్ లో ఉంది. హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గరనుంచే ఆడియన్స్ దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు మేకర్స్. ఆ తర్వాత టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లారు. అందుకే సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతుంటే ఆడియన్స్ దృష్టి అంతా హనుమాన్ పైనే ఉంది. 'గుంటూరు కారం' వంటి పెద్ద సినిమాతోనే పోటీ పడుతుందంటే 'హనుమాన్' కంటెంట్ విషయంలో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 

దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీశారు. పబ్లిసిటీ ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తంగా రూ.60 కోట్ల వరకు పెట్టారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా సజ్జా కాంబినేషన్ కి ఇది చాలా పెద్ద బడ్జెట్. కానీ టీజర్ తోనే మూవీ టీం ఆడియన్స్ ని ఎంతో ఇంప్రెస్ చేసింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోవడంతో ఇది కాస్త నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఆర్జించేందుకు సహాయపడింది. హనుమాన్ నాన్ థియెట్రికల్ రైట్స్ ని జీ గ్రూప్ సంస్థ సుమారు రూ.30 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ అమౌంట్ తో నిర్మాతలకు బడ్జెట్లో సగం రికవరీ అయినట్లే. అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా అమ్ముడు పోయింది.

మొత్తంగా చూసుకుంటే రూ.50 కోట్ల బడ్జెట్ నాన్ థియేట్రికల్ మరియు తెలుగు రాష్ట్రాల నుండి రికవరీ అయింది. ఇక ఓవర్సీస్, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ల సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో హనుమాన్ కి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సినిమాలో డివోషనల్ కంటెంట్ ఉండడంతో నార్త్ లోనూ భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తోనే నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హిందీ కలెక్షన్స్ తో 'హనుమాన్' లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: