నటి మనులకు గుర్తింపు వస్తే వారు కేవలం సినిమాల ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మాత్రమే కాకుండా అనేక హోటళ్ లను , షాపింగ్ మాళ్ లను ఇతరితర వాటిని ఓపెనింగ్ చేస్తూ కూడా బాగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. మరి కొంత మంది బాగా పేరు ఉన్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇకపోతే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతకు అనుగుణంగా మరి కొంత మంది క్రేజ్ ఉన్నప్పుడే వీలైనంత డబ్బును వెనకేసుకోవడానికి ప్రజలకు హానికరం అయినా యాడ్ లలో కూడా నటిస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు.
కానీ కొంత మంది మాత్రం నీతి , నిజాయితీతో ప్రజలకు ఉపయోగపడే యాడ్ లను చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని జనాలు కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. వీరిలో
శ్రీ లీల కూడా నిలుస్తుంది. ఇక అసలు విషయం లోకి వెళితే ... తెలుగు లో వరుస పెట్టి
సినిమా లలో నటిస్తూ టాప్
హీరోయిన్ రెస్ లో ముందు వరుసలో ఉన్న
శ్రీ లీల ప్రస్తుతం కొన్ని షాపింగ్ మాల్స్ కి యాడ్స్ ఇస్తూ డబ్బులను బాగానే సంపాదిస్తుంది.
ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కు ఈ మధ్య కాలంలో మద్యం బ్రాండ్ లకి మరియు ఇల్లీగల్ బెట్టింగ్స్ కు సంబంధించిన కొన్ని యాడ్స్ చేయమని కొంత మంది సూచించగా ఈమె మాత్రం ప్రజలకు హానికరమైన యాడ్ లను చేయను అని వాటి ద్వారా వచ్చే డబ్బు ఆనందాన్ని ఇవ్వవు అని నిజాయితీగా సంపాదించే డబ్బు ద్వారానే చాలా ఆనందం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈమె మందు , ఇల్లీగల్ బెట్టింగ్ లకి సంబంధించిన యాడ్ లను చెయ్యద్దు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే
శ్రీ లీల వ్యక్తిత్వానికి ఆమె అభిమానులతో పాటు మామూలు ప్రజలు కూడా
ఫిదా అవుతున్నారు.