నా బ్లాక్ బస్టర్ సినిమాకు కూడా అన్నీ థియేటర్లు దొరికాయి..ఇవి మాకు సరిపోతాయి..నాగ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ మధ్య కాలంలో తన సినిమాని సంక్రాంతి కి విడుదల చేశాడు అంటే దాదాపుగా ఆ సినిమా హిట్ అవుతూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం నాగార్జున "సోగ్గాడే చిన్ని నాయనక్స్ అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. భారీ అంచనాలు లేకపోయిన మామూలు అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే సినిమా తర్వాత నాగార్జున "బంగార్రాజు" అనే మూవీ తో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు.


ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని నాగార్జున కు అందించింది. ఇకపోతే తాజాగా నాగార్జున "నా సామి రంగ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నాగార్జున వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇకపోతే తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగార్జున ఈ సినిమాకు తక్కువ థియేటర్ లు దొరకడం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ... నేను నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ కి కూడా మాకు 300 థియేటర్ లు మాత్రమే దొరికాయి.


ఆ తర్వాత బంగార్రాజు సినిమా కరోనా సమయంలో విడుదల కావడంతో వేరే సినిమాలు లేకపోవడంతో మాకు చాలా థియేటర్ లు దొరికాయి. ఇకపోతే తాజాగా నేను నటించిన నా సామి రంగ సినిమాకు కూడా 300 థియేటర్ లు లభించాయి. మా సినిమాకి ఈ థియేటర్ లు సరిపోతాయి అని తెలియజేశారు. ఇకపోతే నా సామి రంగ సినిమాలో అశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: