తెలుగు హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం..!!
ఈ విషయాన్ని పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేయడం జరిగింది.. అంతేకాకుండా తన అమ్మమ్మతో గడిపిన కొన్ని మధురమైన తీపి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా పోస్టులు షేర్ చేసింది. ఆమెతో పాటు దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయక ఈ ఫోటోలు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ ఫోటోలకు పూజా హెగ్డే మాత్రం.."we miss you aaji" అంటూ ఒక ఎమోషనల్ కామెంట్స్ తో ఈ ఫోటోలను షేర్ చేసింది. ఇలా తన అమ్మమ్మ మరణ వార్తను కూడా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ పోస్ట్ చూసిన అభిమానుల సైతం పూజ హెగ్డేను కాస్త ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పూజా హెగ్డే సోదరి భూమి శెట్టి వివాహం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ పెళ్లిలో తన కుటుంబంతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది పూజా హెగ్డే.. అలా ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేకపోయింది అంతలోనే తన అమ్మమ్మ మరణంతో పూజా హెగ్డే ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి.. ప్రస్తుతం పూజ హెగ్డే సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లోనే ఒక సినిమాలో నటిస్తున్నది.. చివరిగా టాలీవుడ్ లో ఆచార్య సినిమాలు నటించింది. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.