పవర్ స్టార్ పై ఆశలు పెట్టుకున్న శ్రీలీల....!!
ఇక దాని తర్వాత వచ్చిన ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్ అయితే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియలేదు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా కనీసం ఉనికిని చాటుకోలేక పోయింది. దాంతో శ్రీలీలకు మళ్లీ ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన ఆది కేశవ మూవీ కూడా ఇంతే దారుణంగా ప్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయి ఎటూ కాకుండా పోయింది. సరే ఇవన్నీ ఓకేలే.. మహేశ్ బాబు మూవీ ఉంది కదా అని ఆమె ఆశలు పెట్టుకుంది. గుంటూరు కారం ఎలాగైనా పెద్ద హిట్ అవుతుంది కాబట్టి.. మళ్లీ ఛాన్సులు వస్తాయిలే అనుకుంది.కానీ ఆమె ఆశలపై నీళ్లు పడ్డాయి. ఎందుకంటే గుంటూరు కారంకు పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. ఆ సినిమా ప్లాప్ అనే టాక్ వస్తోంది. దాంతో శ్రీలీల ఖాతాలో వరుసగా మూడు ప్లాప్ లు పడ్డాయి. ఇప్పుడు ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. దాంతో పాటు విజయ్ దేవరకొండ సినిమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది.కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆశలు మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదనే ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా హిట్ అయితేనే ఆమెకు కెరీర్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆమెను అంతా ఐరన్ లెగ్ అని ముద్ర వేయడం పక్కా అని అంటున్నారు సినీ విశ్లేషకులు