"గుంటూరు కారం" కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇకపోతే తాజాగా మహేష్ "గుంటూరు కారం" అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నిన్న అనగా జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 16.45 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  సిడెడ్ ఏరియా లో 3.31 కోట్లు ,  ఉత్తరాంధ్ర లో 4.05 కోట్లు , ఈస్ట్ లో 4.01 కోట్లు , వెస్ట్ లో 2.60 కోట్లు , గుంటూరు లో 4.36 కోట్లు , కృష్ణ లో 2.56 కోట్లు , నెల్లూరు లో 1.54 కోట్ల కనెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి మొత్తంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.88 కోట్ల షేర్ ... 52.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... శ్రీ లీల , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో మహేష్ కి జోడి గా నటించారు. రమ్య కృష్ణ , జయరామ్ , రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు పర్వాలేదు అనే రేంజ్ టాక్ రావడంతో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్ లు లాంగ్ రన్ లో లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: