సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసి సుమారు ఏడాదికి పైగానే పూర్తవుతోంది. 2022 నవంబర్ ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రం లో మునిగిపోయారు.కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఇప్పటికీ తన తండ్రిని తల్చుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఇదిలా ఉంటే కృష్ణ అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఆయన నటించిన ఆఖరి త్వరలోనే థియేటర్ల లో రిలీజ్ కానుంది . అదే కృష్ణ విజయం. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. మ ధుసూదన్ హవల్దార్ దర్శకత్వం తెరకెక్కించిన కృష్ణ విజయంలో నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల ఆఖరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కృష్ణ విజయం ను థియేటర్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుమారు 16 ఏళ్ల క్రితం అంటే 2007లోనే ఈ షూటింగ్ ప్రారంభమైంది. మొదట ప్రేమ చరిత్ర పేరుతో షూటింగ్ ప్రారంభించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు 'కృష్ణ విజయం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ కృష్ణ కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోకూడదని భావించి విడుదల చేస్తున్నారట.
ఇక కృష్ణ విజయం దర్శకుడు మధుసూదన్ కన్నడలో ఎన్నో సూపర్ హిట్ లు తెరకెక్కించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా జరిగిన కృష్ణ విజయం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృష్ణ- మహేశ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుంటూరు కారం పై కూడా స్పందించారు. బాగా లేపోతే కృష్ణ ముందుగా చెప్పేసేవారని , మహేశ్‌కు కూడా ఆ లక్షణం అబ్బిందని వారు చెప్పుకొచ్చారు. కావాలనే కొందరు గుంటూరు కారంపై నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.